Friday, November 5, 2021

ధిక్కార స్వరం తేదీ : 09-09-2021 శీర్షిక : దక్కను ముద్దు బిడ్డ

 ధిక్కార స్వరం

తేదీ : 09-09-2021
శీర్షిక : దక్కను ముద్దు బిడ్డ 
కవిత సంఖ్య : 749

తెలంగాణా భాష యాసల ప్రేమికుడు 
మరాఠా మూలాలున్నా .. కన్నడ 
కంఠీరవమైనా... తెలంగాణలో స్థిరపడ్డ పులిబిడ్డ  
దక్కను పీఠభూమి ముద్దు బిడ్డ .... 

ప్రజలే శ్వాసలు  ... ప్రజలే యావలు  .... 
సతతం సగటు మనిషికై  పలవరించిన 
సమున్నత మానవతావాది .... 
సామాన్యుని గొడవే తన గొడవ ..... 

ఆర్ద్రతలు నిండిన ఆప్యాయం .... 
రంగులద్దుకున్న రాజకీయాలను 
సున్నితంగానే ప్రశ్నించే వారు .... 
నిక్కచ్చిగా నిలబడే తత్వం ..... 

పుట్టుక చావులొదిలి పుడమి 
మీద జీవితమంతా సాటి 
మనుషులకేనని సంకేతించిన 
సమున్నత సజీవ తార్కాణం ... 
పార్థీవాన్ని సమర్పించుకున్న 
పరమ ఆచరణాత్మక గుణశీలి .... 

భాషైనా ... యాసైనా ... పాలనైనా 
అన్ని ఉద్యమాలను అందిపుచ్చుకున్న 
అచ్చమైన తెలంగాణా వాది ... 
యాస నుడికారాల ఘాటును మమకారాల 
మాటను మంత్రించి ప్రశ్నించిన ధిక్కారం 
తెలుగంటే అమితమైన ప్రేమికుడు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment