సస్య శ్యామలం
తేది: 09-10-2021
శీర్షిక: సుభిక్షం
కవిత సంఖ్య: 174
నెత్తి మీద ఉత్తరాన హిమ శిఖరములు
పొదువుకుని... మూడుప్రక్కల సంద్ రపు
నీటితో ముత్యమై మెరుపులు ప్రకాశిస్తూ...
పాయలు పాయలుగా కదిలిన చిన్న చిన్న
నీటి వనరులన్నీ బైలెల్లి సెలయేళ్ళుగా
గలగలలాడుతూ శోభిస్తూ . మార్పు చెంది...
చిన్న చిన్న నదులుగా కదిలి కదిలి
కలిసి జీవనదులై పరీవాహకాలన్నీ
పచ్చ తివాచీలు పరుచుకుని... కొండా కోనా
పర్వతాలు లోయలెన్నో ఆభరణాలుగా చేసుకుని
వ్యవసాయాధారితమైనది మనదేశం ...
కాల మాన పరిస్థితులకనుగుణంగా
నైరుతి
ఋతుపవనాలతో .... ఈశాన్య
ఋతుపవనాలతో... నదీమ తల్లులన్నీ
చల్లని దీవెనలందిస్తూ హాలికులను
ఆదుకుంటూ దేశమంతా సుభిక్షమై
సస్యశ్యామలంగా వర్ధిల్లచేస్తున్నది .....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment