చిత్ర కవిత
తేడా 08-10-2021
శీర్షిక : మేదరి బతుకులు
కవిత సంఖ్య : 54+5
వెదురును నమ్ముకున్న వేల్పులు వాళ్ళు
నుదురు మీద అదృష్ట గీతల కనుమరుగు
పాలకుల దృష్టి పడని దురదృష్టవంతులు సంఘములో ఎవరికి పట్టని పిట్ట బతుకులు....
ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ....
ఒకప్పుడు ఎంతో విలువైన ఇషిరెలు
ఎవుసానికి ఎంతో అక్కరకొచ్చే వస్తువులు
శాట గంప అంచె పొనుకల చేతి వృత్తులు ...
వెదురు గడ్డి కుటుంబమే అనుకుంటాం
కానీ గట్టి మేలు తలపెట్టే అదురు సుమా
నిట్టాడులా అన్ని అమర్చుకున్న కుందనం
నాగరికతల నడకల్లో అడుగులు నేర్పిన
చందనం .....
ఆధ్యాత్మికతలు అందిపుచ్చుకున్న
నిండు శోభలనిచ్చు పూల పండగలో
గౌరీ దేవి ఆసనమై నిలుచు శిబ్బిగా ...
జన జాతరలు తలపించే
వనదేవత ఉత్సవం మేడారంలో
అమ్మ ప్రతిరూపం కుంకుమభరిణిగా .
సరాగాలు వల్లించే సంగీత సాధనం
సుందరమై నిలిచే రమణీయ గానం
మాధవుని జాడలు కనిపెట్టే గాత్రం
రాధమ్మ ప్రేమగుర్తుల మనోవ్రతం
కఱ్ఱ ఊతమై కల్పించు పనిముట్లు
గుజ్జు తయారీతో కాగితానికి మూలం ...
అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా
కొన్నిచోట్ల ఆకలి కూడా తీర్చు ....
ఆయుర్వేదంలో కూడా ఆణిముత్యమై
నిలిచిన వనమూలిక ..
ఒకప్పుడు అంతా తానై నిలిచినా
ఒంటరి పోరాటాలు చేస్తున్నారీనాడు ....
బతుకులీడ్వడమే బహు కష్టంగా
మేదరి పనుల చేతి వృత్తుల వాళ్ళు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment