చిత్ర కవిత 23.
తేది : 25-10-2021
శీర్షిక : స్వామి కార్యం స్వకార్యం
కవిత సంఖ్య : 782
ఉత్పత్తుల నత్త నడకలు ఉరుకుతున్న
జనాభా పరుగులకు... ఉడతా భక్తిగా
జతలు చేయాలనే ఉబలాటాలే
మనిషి అవసరాల అనుగుణతలే
కొత్త కొత్త ఆవిష్కరణలకు మూలం ....
రసాయనాలను కౌగలించుకుని
రారాజుగా వెలుగుదామనుకునేలోపే
రకరకాల అనారోగ్యాల బూచీలతో
రంది పట్టుకున్న మానవ మస్తిష్కం .....
పట్టణీకరణ ఫరిఢవిల్లుతుంటే....
సొంత గూటి కలలతో కొంత .... చుట్టు ముట్టు
పల్లెల పంట స్థలాలే ప్లాట్లయి పోతూంటే ....
బహుళంతస్తుల్లో కూడా బసలు కనిపెట్టె ....
అమృతతుల్యమైన ఆరోగ్య స్మరణలో ....
కాలుష్య భూతాల కబంధ హస్తాలో .....
ప్రత్యామ్నాయాల పరిశోధనలో ......
తీరిక సమయాల కాలక్షేపాలో .....
వెరసి ఇంటిపైకి మళ్లింది గాలి .....
చిన్న చిన్నగా మొదలెట్టి .... చిత్రమైన
అలవాటుగా మార్చుకుంటూ ... అన్ని రకాల
పండ్లు కూరగాయలతో ... కలల ప్రపంచాన్ని
కళ్ళ ముందే ఆవిష్కరించుకుంటూ
మిద్దె తోటలాయె నేడవి ముద్దు ముద్దుగా .....
పండ్లు కూరగాయల వ్యర్థాలే ...
ఫలవంతమైన సేంద్రీయ ఎరువులవగా .....
సేద్యాలు చేస్తూ చెమటలు కక్కి
సేద దీరుతున్నాడు ఆధునిక మానవుడు ....
స్వామి కార్యం స్వకార్యం ..... చక్కబెట్టు
అన్ని విధాలా అందే ఆరోగ్యం .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment