Friday, November 5, 2021

దేశ భక్తి గేయం తేది: 02-10-2021 శీర్షిక : శతాబ్ది నాయకుడాయె...

 దేశ భక్తి గేయం 

తేది: 02-10-2021
శీర్షిక : శతాబ్ది నాయకుడాయె... 
కవిత సంఖ్య : 768…. 

ఏ మత సారమైనా
మానవాళి క్షేమమని…
శంఖమూది బోధించే 
శరణంటూ బాపూజీ … //మతాల//

కులమంటూ రెచ్చగొట్టి
మతమంటూ  విడగొట్టి 
ముక్క చేసే భారతాన్ని  
అక్కసుతో తెల్లవాడు.... //మతాల//

కర్ర చేత పట్టుకున్నా
కొల్లాయిని కట్టుకున్నా
కోట్లాది భారతీయుల 
మనసు కొల్లగొట్టాడు .... //మతాల//

సత్యమే శక్తివంతమని 
తపనపడ్డ తపోధనుడు 
అహింసనే ఆయుధంగ
సంధించే తెల్లోనిపై ..... //మతాల//

అతివాదం చేటని 
మితవాదం మేలని 
అనుసరించి చూపాడు 
ఆచరించి గెలిచాడు.    //మతాల//

దేశగతిని మార్చాడు 
దశ దిశల వెలిగాడు 
శత విధాల గెలిచి తాను
శతాబ్ది నాయకుడాయె... //మతాల//

అన్ని మతాల సారం
అహింసా వాదమేనని
అనుసరించు సోదరా 
ఆచరించు వేగమే….    //మతాల//

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment