నేనొక అక్షరాన్ని
తేది : 01-11-2021
శీర్షిక : కవి గళాన్ని .....
కవిత సంఖ్య : 170
అమ్మ పంచిన అమర ప్రేమను
నాన్న నింపిన నడవడికను
గురువులు నేర్పిన గురుతరాన్ని
చదువుల తోటలో ఓంకారాన్ని .....
అనుబూతుల తోటలో ప్రోది చేసుకున్న
అనుభవాలతో అలరారుతూ ఆకారం
దిద్దుకుని... అందమైన పదాలుగా
కూర్చుకుని... భావాత్మక వాక్యాలుగా మారి..
భావాలను పండిస్తూ సమాచార చేరికకు
నేనొక సారికను .....
జీవితపు పూదోటలో మంచి చెడుల
విచక్షణలు వల్లె వేసుకోగలిగే జ్ఞాన
భాండాగారాన్ని....విజ్ఞానాల ఖనిని ..
వినూతన సమాలోచనల వింత నిధిని ....
చర్విత చరణాలయ్యే చరిత్రల
మూలలను .... తాత్వికతల
తపోధనుల పద్యాలను .... ఘనమైన
కవిపండితుల గళాల సవరింపును.....
పల్లె జనుల నోట పారాడే జానపదాన్ని
పద కవితా పితామహుల భక్తి భావాన్ని
సంఘ సంస్కర్తల చేతిలో జాలువారిన
కాలజ్ఞానాన్ని .... ఉద్యమాల ఉనికిని ...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment