సౌదామిని
తేది : 20-09-2021
శీర్షిక : వర్షం .....
కవిత సంఖ్య : 757
గ్రీష్మ తాపాలకు గిలలాడిన నేలమ్మకు
సంద్రపు నీటిని తస్కరించిన వాతావరణంతో
నింగిన చేరిన మేఘాల మాలలు....తరలి వెల్తూ
కారు మబ్బులై కనికరించి... అప్పుడప్పుడు తెరలు
తొలిగించి తొంగి చూస్తూ.. విద్యుల్లతలా మెరుపులు
విసురుతూ.....ఆర్ణవమై అవనిని వర్షంగా
కౌగిలించుకుంటుంది .....
తొలకరిలో పులకరించిన ధరణీమాతను
చూసి... చూడగానే... గుండెలు నిండిన
హాలికుని కళ్ళల్లో కోటి కాంతులు దీపాలు
వెలిగి....రాబోయే శుభ సంకేతాల సందర్భాలు
సుఖ సంతోషాల మూటలు.... మైమరిపించి
గొంతులో మాటలు పెగలనీయవు .....
పచ్చని తివాచీలు పరుచుకున్న పృథ్వి
కొండా కోనకు ...చెట్టూ పుట్టకు....గి రికి
తరువుకు కూడా పచ్చదనాలను అద్ది...
జీవకోటి కళ్ళల్లో కాంతులు నింపుతుంది .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment