ఎదురొడ్డి పోరాడు
తేది 14-10-2021
శీర్షిక : గెలవాల్సిందే ....
కవిత సంఖ్య : 54+8
ఆకారం లేకుండానే ఆరాటపడి
పోరాటం మొదలు పెట్టిన పొద్దుపొడుపు
గడువులోపల ఒడుపుగా నిలుపుకోకపోతే
రూపం లేని చిరునామాలే గల్లంతు .....
అరువది నాలుగు లక్షలు ప్రవహిస్తే
అంకురం అయి నిలిచేది ఒకే ఒక్క
కణం....అమ్మ గర్భాలయములో .......
అంచెలంచెలుగా పోరాడి అంగాలు
మొలిపించుకుంటూ ....ఆకారం చెంది
అమ్మ పొత్తిళ్ళలో ఆహారం పొంది
తనువు పెంచుకుని... మనువు పోసుకుని ....
ప్రపంచానికి పరిచయం కావాలి .....
పుట్టీ పుట్టగానే ఆదమరిచి నిద్రపోయి
ఉలిక్కి పడి లేస్తూ ... ఉగ్గబట్టి ఏడుస్తూ ...
కాళ్ళు చేతులు కొట్టుకుంటూ...
కడుపు నింపుకోవడానికి పోరాటం ....
దొర్లి పొర్లడానికి మొదలయ్యి
కూర్చోవడానికి .... కూసింత
నిలబడడానికి ....మరికొంత
అడుగులేయడానికి .... ఇంకొంత
ఆరాటాల పోరాటాలే అధ్యయనాలు ....
మనిషి పెరిగి పెద్దవుతున్న కొలదీ
పరిధి పెరిగి...బరువు బాధ్యతలు
పెరిగి ... బంగారు భవిష్యత్తుకు
బాటలు వేసుకునే అడుగులలో
ఆహరహరం ఎదురొడ్డి నిలవాల్సిందే......
పోరాడి జీవితాన్ని గెలవాల్సిందే .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment