బతుకమ్మ పాట
తేది: 09-10-2021
శీర్షిక : మధ్యోడి సరికొత్త రాగం
కవిత సంఖ్య : 774
బతుకమ్మ పాటంటే ఉయ్యాలో
బతుకులోని కోణం ఉయ్యాలో
కాలమాన స్థితుల్లో ఉయ్యాలో
కష్టాలు ఎండగట్టి ఉయ్యాలో
గట్టి బోధ చేసి ఉయ్యాలో
గట్టెక్కించే మార్గమే ఉయ్యాలో
కులమతాలు లేవంటూ ఉయ్యాలో
మనువును తప్పుపట్టి ఉయ్యాలో
మనంజేశే పనేందో ఉయ్యాలో
మనసుపెట్టి జూడాలి ఉయ్యాలో
ఒళ్ళు హునం చేసుకుని ఉయ్యాలో
పన్ను మేము కడుతుంటే ఉయ్యాలో
పాలనలు చేస్తమని ఉయ్యాలో
పగ్గాలు చేతబట్టె … ఉయ్యాలో
ఉత్పత్తులు లేకుండనే ఉయ్యాలో
ఉత్తుత్తి లాజిక్కుల ఉయ్యాలో
పంపకాలు చేసుకుంట ఉయ్యాలో
ఓటు మాకంటున్నరు ఉయ్యాలో
బాధ్యతలను మరిచిరి ఉయ్యాలో
మన హక్కులు కాలరాసి ఉయ్యాలో
దుక్కులేమి దున్నకుండ ఉయ్యాలో
పంటలు పండిచ్చుడంట ఉయ్యాలో
జవాబుదారితనం ఉయ్యాలో
దారితప్పె చూడ ఉయ్యాలో
క్రమశిక్షణలన్నీను ఉయ్యాలో
మాయమైపోవట్టె ఉయ్యాలో
పెద్దోళ్ళు అప్పుచేసి ఉయ్యాలో
కట్టకుండ పారిపాయె ఉయ్యాలో
చిన్నోడు పనుల్లేక ఉయ్యాలో
పెన్షన్ల బాటపట్టె ఉయ్యాలో
మిగిలినది ఎవ్వరో ఉయ్యాలో
లెక్క తేలగొట్టాలి ఉయ్యాలో
పక్కాగ చేయపోతె ఉయ్యాలో
తిరోగమనమె మన బతుకు ఉయ్యాలో
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment