మనసు గంధమైతేనే
తేది : 14-10-2021
శీర్షిక : మల్లెల సుగంధం
కవిత సంఖ్య: 777
కమలమై విచ్చుకుంటేనే కదా
పరిమళాల వాసనలు వెదజల్లేది ....
మాటలు మల్లెల సుగంధాలయి
మనుషుల్లో బంధాలు అల్లుకునేది ....
మా ఇంటికొస్తే ఏం తెస్తావ్
మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్ ... కాకుండా
ఆదరణలు మనతోనే మొదలయితే
అడుగులు కలిసి పయనమవుతుంది ....
ఆడంబరాల అడ్డుగోడలు
బద్దలయితేనే .... ఆప్యాతల లతలు
తమ పర బేధాలెరుగని వట వృక్షంలా
అంతటా తీగలు అల్లుకునేది .....
తలుచుకుంటే చాలు .... తల్లడింపులు
మాయమై తనువు పులకరించాలి ....
స్మరించుకుంటే చాలు చిరునవ్వులు
ముఖారవిందముపై పులుముకోవాలి ....
జీవరాశిలో మిన్నంటూ వాపోవడం కాదు ...
చెత్త చెదారం బురద మలినాలనుండైనా
మంచిని స్వీకరించగలిగే అంబుజమై...
ఆనందాలను వెదజల్లగలగాలి ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment