స్వేచ్చా కవిత
తేది : 12-09-2021
శీర్షిక : పిల్లల మనోగతం
కవిత సంఖ్య : 164
పెద్దల్లారా పెద్దల్లారా
పిల్ల పిడుగులకు
ముద్దు ముద్దుగా
ముద్దులిచ్చే పెద్దల్లారా
...
అడగక ముందే అన్నీ ఇచ్చి
ఆనందాలను నింపే మీరు
అలసత్వాలను చూపకుండా
ఓటు ఆయుధం వాడండి .....
మంచి చెడులు విడమరిచి
మల్లె పరిమళం చేసే మీరు
మా భావి జీవితాలకు
మార్గదర్శకులవ్వండి .....
విద్యా బుద్దులు విరివిగ నేర్పి
విరించి గీతల విప్పార్చే మీరు
చలువ పందిళ్ళ చావడి లాగా
విలువలు మాత్రం మరవకండి ....
స్వార్థాల సంచులు నింపక
సౌభ్రాతృత్వపు గాలులు వీచే
సౌహార్థపు సంఘముగా నిలిచే
సదాచారములు నింపండి .....
చక్కని జీవితం మాకివ్వాలంటే
పక్కా ప్రణాళికలు వ్రాయించి
చిక్కు ముడులకు తావిచ్ఛే
లెక్కలకందని బొక్కసాలు వద్దు
మహీతలం మహిమలేమోగాని
మహామహులెంతో మంది
మట్టికరిచిన దాఖలాలే....గాని
కట్టుకుపోయిన ఆనవాళ్ళే లేవు ....
విడనాడండి గోరోజనాలు
విశ్వసించండి గీత బోధనలు
వినగా రండి రామ రాజ్యాలు
వీనుల విందు శాశ్వతాలు ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment