Friday, November 5, 2021

ఆంక్షలు ... ఆకాంక్షలు-1 తేదీ: 07-10-2021 శీర్షిక : ఈ వైవిధ్యమే ...

 ఆంక్షలు ... ఆకాంక్షలు

తేదీ: 07-10-2021
శీర్షిక : ఈ  వైవిధ్యమే ... 
కవిత సంఖ్య : 

ఆంక్షలు .... ఆకాంక్షలనే 
ఈ వైవిధ్యతలే మానవాళిని 
మరో కోణంలో వేరు చేసి చూపింది 
సమూహ జీవరాశి నుండి .... 

రేఖాంశముల్లాంటి ఆకాంక్షలే 
హిమగిరిశిఖరముల ఆరోహణ 
అక్షాంశాల్లాంటి ఆంక్షల రేఖలే
కొండా కోనలు..నదీమ తల్లులు..

ఆశలు ...ఆశయాలు...ఆలోచనలు 
ఆకాంక్షలు.... మేధో మధనం ... 
వివేకం ... వివేచన....విచక్షణ
మానవాళి పురోగతికి సోపానాలు ....  

మనిషి ఎంత ఋషీశ్వరుడైనా 
అప్పుడప్పుడు అవధులు దాటే 
తత్వాన్ని జయించలేడు ..... 
అవధుల జ్ఞాపకాలకే ఆంక్షలు ..... 

ఆంక్షలు ... ఆకాంక్షలు 


నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment