రాజ భాష
తేదీ : 14-09-2021
శీర్షిక : జాతీయత
కవిత సంఖ్య : 752
మల్లెలెంత గుబాళించినా
మరువ దమానాలెంత
పరిమాళాలు వెదజల్లినా
మాలకు తోడయ్యే తోరములా
భిన్న సంస్కృతుల కలిపి
నిలిపే కారణ మూలం కావాలి.
కనకాంబరాలెంత కళకళలాడినా
కలిపి నిలిపే కలబోతల
దారముంటేనే ధవళాక్షుల
మనసులు చూరగొన్నట్టు ....
భిన్న భాషల మూలాల
సంస్కృతపు సంతతి కావాలి .....
రంగు రంగుల గులాబీలెంత
రమణుల మనసులు దోచుకున్నా
శిరమున పట్టిపెట్టే శిఖపిన్ను
అనుసంధానతలా ... అత్యంత
ప్రాముఖ్యమే ఆత్మ గౌరవం నిలబెట్ట
మనకంటూ ఒక జాతీయ భాష ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment