Friday, November 5, 2021

బాలల గేయాలు తేది: 11-09-2021 శీర్షిక : బాలల స్వగతం

 బాలల గేయాలు 

తేది: 11-09-2021
శీర్షిక : బాలల స్వగతం 
సంఖ్య : 750

చదువు చదువు చదువు 
చదువులంటూ మమ్మల్ని  
సతాయిస్తారెందుకు 

సౌకర్యాలెక్కువని 
సాంకేతికతలొచ్చాయని 
సౌలభ్యం మాకంటూ 
సన్నుతించి చెబుతారు ....//చదువు//

మెదడుకు మేతగా 
చదువుల పాటుగా 
శారీరక సత్తాలకు 
ఆటా పాటలు తోడే గా  ..... //చదువు//

ఆడితే ఆయాసమంటూ 
దూకితే పడిపోతవంటూ 
ఎగిరితే జాగ్రత్తలంటూ  
గెంతితే కోప్పడతారెందుకు  ..... //చదువు//

తాత కథలు వింటుంటే 
తమాషాలు గుర్తొస్తయి 
తానాడిన  ఆటలు 
తానెగిరిన బాల్యము ..... //చదువు//

నాగరికత నీడలో 
పట్టణాల పడగలో 
ఆటలకు జాగాలేని 
పోటీ బతుకు మాది  ... //చదువు//

బాధ్యతగా చదవమని 
బహుబాగా చెబుతారు
ఆటవిడుపు లేకుంటే 
అసలుకే మోసమేగా   ... //చదువు//

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment