Friday, November 5, 2021

అడుగు జాడలు తేది: 21-09-2021 శీర్షిక : మూలాలు

 అడుగు జాడలు

తేది: 21-09-2021
శీర్షిక : మూలాలు 
కవిత సంఖ్య : 758

ప్రయాణమెప్పుడూ ...ఒక్క అడుగుతోనే 
కొత్త ప్రయాణపు బాటలో అడ్డంకుల 
ముళ్ళు ... పొదలు.... జరుపుకుంటూ 
గమ్యపు వెదుకులాటలే సమాయాతీతం ... 

పెద్దోళ్ల అడుగుజాడల్లో మనం నడిస్తే .... 
తక్కువ రోజుల్లోనే  పూల బాటలౌతాయి .... 
మరో కొత్తదనానినికి  కూడా సులువుగా బాటలు 
వేసి ... మనమూ .... మార్గదర్శులం కావొచ్చు .... 

భావాలైనా ... భాషైనా .... బతుకైనా .... 
అనుభవజ్ఞుల ఆసరాలుంటేనే ..... 
అగ్రశిఖరాలను అతి సునాయాసంగా 
అధిగమించి...  అందలాలు కులుకవచ్చు ..... 

అమ్మానాన్నల ఆత్మీయతల  పలకరింపులు 
తోబుట్టువుల అనురాగ బాటల అనుకరింపులు ... 
గురువుల గంభీర వదనపు మందలింపులు .... 
నేర్చుకున్న విద్య విజ్ఞాన వివేక వివేచనలు ..... 

కాలానుగుణంగా మార్చుకోవాలన్నా 
కాలాతీతలను కదిలించాలన్నా 
కనికట్టు చేసి కంటికింపుగ మెరవాలన్నా 
మూలాలు సదా మనకెంతో ఉపయోగం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment