తిమిరంతో సమరం
తేది:-07-10-2021
శీర్షిక : ముందడుగే శరణ్యం ….
కవిత సంఖ్య : 54+4
అంకురం నుండే అలవడిన
అపూర్వమైన విద్య .... అయినా
అప్పుడప్పుడు డస్సిపోయి
అచేతన వాక్యాలు పలుకుతూంటాం ....
అది ఇది అని కాలక్షేపాలు
చేస్తూ ... కీర్తులన్నీ మనఖాతాలో ...
వైఫల్యాలేమో ఎదుటి వారి
ఖాతాలో వేస్తూ నెట్టుకొస్తూంటాం ....
స్వార్థాలను సందు చివర
వదలాలని ....మొహాలని
ఊరావల విసిరేయాలని
అసూయలను అల్లంత దూరాన
పెట్టాలని ... ద్వేషాలను దేశ
సరిహద్దులు దాటించాలని
మాత్రం ప్రయత్నం చేయం .....
అంతః శక్తిని అంచనా వేయలేక
కోరికల ప్రపంచంలో కూరుకుపోయి
అస్తరు పన్నీరనుకుని మనం
కుడితిలో ఎలుకలా ...మునకలేస్తున్నాం ...
గాంధీజీలా నిలబడు
సుభాషులా కలబడు
అల్లూరిలా ఆక్రోషించు
ఛత్రపతిలా విజృంభించు…
శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకుని
అడుగులు ముందుకేస్తే….
అంతా నీ చేతుల్లోనే …..
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment