బాలాత్రిపుర సుందరి
తేది : 07-10-2021
శీర్షిక : అమ్మ రూపం
కవిత సంఖ్య : 173
అమ్మ రూపం అనంతం
శరన్నవరాత్రుల్లో ... 9 రోజులు
సర్వాంగ సుందరంగా అలంకరించి
ఆరాధిస్తాము .... ఆనందిస్తాము ...
శైలపుత్రీ, బాల త్రిపుర సుందరీ ,
గాయత్రీ, లలితా దేవి, సరస్వతీ దేవి
అన్నపూర్ణ దేవి, మహాలక్ష్మి, దుర్గాదేవి,
మహిషాసుర మర్ధిని....రాజరాజేశ్వరీ
దేవిగా .....
ఇచ్చాశక్తి ... జ్ఞానశక్తి ....
క్రియాశక్తి ..... రూపాంతరాలే
అంబికాదేవిగా .... సృష్టి స్థితి
లయల ఆటలే అమ్మవారి
చేతలు ......
ముల్లోకాలనేలే తల్లి ఆది
పరాశక్తి ... ముమ్మూర్తులా
త్రిపురసుందరి....
జాగృత్, స్వప్న , సుషుప్తి
అవస్థల అధిష్టాన దేవత
అభయ హస్త ముద్రలతో
అక్షరమాల ధరించిన తల్లి
షోడశవిద్యల అధిష్టానము...
ఉఛ్వ్వాసా నిశ్వాసాత్మకమైన
శ్వాసలే ప్రాణవాయువులు
శ్వాస సంకేతం హంసలు
హంస వాహినీ అమ్మవారు .
శ్రీ చక్రం పై వామ పాదం మోపి
చెరుకువిల్లు చేత బూని ... విరి
బాణములు ఉరితాడు కొరడాలతో
అచ్చంగా సాక్షాత్కరించిన శ్రీ లలితా
శివ జ్యోతి సర్వ కామదా .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment