చైతన్య గేయం
తేది : 25-09-2021
శీర్షిక : మేధావి
కవిత సంఖ్య :762
మానవుడా
ఓ మహనీయుడా
గుర్తించు నీ బలము
మేధస్సే ఆయుధమని
భూదేవి మీద నీవు
మేధావిగ అనుకోకు
పుట్టి పెరిగి ప్రకృతిని
పుట్టి ముంచుతున్నావు //మానవుడా //
పంచడమే నేర్పిన
ప్రకృతమ్మ పాఠము
పాటించక ఎందుకు
వంచిస్తూ ఉన్నావు .... //మానవుడా //
ఇంధనాల కోసమని
మంతనాలు జరుపుతూ
క్వారీల పేరుతో
జోరైనా యాపారం .... //మానవుడా //
కల్తీలతో సావాసం
కలిసి మెలిసి జేస్తున్నవ్
కాలుష్యపు కాపురాన్ని
వెలగబెడుతూ ఉన్నావు .... //మానవుడా //
స్వార్థాలను విడనాడు
సాటి మనిషి ప్రేమకై
ద్వేషాలను దిగమింగు
గరల కంఠు నీవయ్యి .... //మానవుడా //
No comments:
Post a Comment