Friday, November 5, 2021

చిత్ర కవిత తేది : -27-09-2021 శీర్షిక : ప్రాణాలరచేత పట్టి ..

 చిత్ర కవిత 

తేది : -27-09-2021
శీర్షిక : ప్రాణాలరచేత  పట్టి ....  
కవిత సంఖ్య : 763

మలిన మానవ మేధలెన్నో కలిసి  
విశ్వ మానవాళి నాశములను కోరగ..
కంటికి కనపడని క్రిమి తాండవమై  
వెంటపడి తరుముచుండె ఈనాడు..
పాడు కరోనాతో గూడులెన్నో చెదిరే  .... 

ఎప్పటికప్పుడు రూపాలను మార్చుకుంటూ 
విడతలుగా తరంగాలలో తరలివస్తూ 
మనిషి గుండె ధైర్యాలను పరీక్షిస్తూ 
నిండు జీవితాలతో చెలగాటమాయె .... 

ఇప్పుడిప్పుడే తేరుకుని బుడిబుడి 
అడుగులు ... బడి వైపు పయనమాయె 
భయాలన్నీ నీడలా వెంటాడుచుండగ 
ప్రాణాలరచేతులలో  పట్టుకుని దీక్షగా ....

ఆట పాటల చదువు నేర్వవలసిన 
అందమైన బాల్యమంతా  ...అంటరాని 
తనముతో  దూరాలు పాటిస్తూ ... 
బిక్కు బిక్కు మంటూ ఒంటరై రిస్క్ తగ్గని 
జోరుకు మాస్క్ కళ్లెం తగిలించుకుని  ....

కరుణ గల్ల చదువుల తల్లి సరస్వతమ్మ 
కాముక పూనుకుని కరుడు గట్టిన కరోనా 
క్రిమి సంహారం...  తాను చేయాలని... 
కనుల పంటలైన మన పసి పిల్లలంతా 
కమ్మని జీవితాలను ఆహ్లాదకరంగా 
అనుభవించాలని మనసారా కోరుకుందాం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment