అప్పుడప్పుడు
తేది : 24-09-2021
శీర్షిక : ప్రజా పాలకులు
కవిత సంఖ్య : 761
పని మీద మనం లఘ్నమైనా ...
మనిషిక్కడ... మనసెక్కడనో .....
ఉన్నఫళంగా ఎగిరి మరెక్కడో
వాలిపోతుంది విహంగమువలె....
చిత్తం శివుని మీద మనసేమో
చుట్టుముట్టు ... ఎంతైనా మనమంతా
వచ్చింది మర్కటములనుండి
మారినా జాతి చిహ్నాలము కదా .....
బాల్యపు తరగతి శిక్షణలకు
బతుకు బాటలోని పరిస్థితులకు
పొంతన కుదరక ... బంధం విడువక ...
ఔచిత్యము గాని ఆలోచనలు నిండు .....
అప్పుడప్పుడు మెండుగా....
సత్య హరిశ్చంద్రుని సంతతులమని
సగర్వంగా సన్నుతించె ఒకనాడు
సంబరాలు పంచ... సాధువంటి గురువులు...
అక్షరాల పాటించిన అయినవాడు ఒక్కడు
మహాత్ముడైనాడు ... మహనీయుడైనాడు ....
రాములోరు గొప్ప రాజని.... ప్రజలకోసమే
పనిచేసేవాడాని పురాణాలెన్ని ఘో షించినా
మహా కావ్యాలై మన్నించినా ..... మారరేలనో
మన ముందున్న ప్రజా పాలకులమని
ప్రకటించుకుంటున్న నాయకులు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment