చిత్ర కవిత
తేది : 03-10-2021
శీర్షిక : అందమైన కేశాలంకరణ
కవిత సంఖ్య : 172
సహజ సౌందర్యాల సాదా జుత్తయినా
వంకీల గిరికీల రింగుల జట్టైనా
నిశి చీకట్లను పోలిన కురుల సంపద
మహిళా మణులకు శోభలు కూర్చు
మగ మహా రాజులకు మతులు భ్రమించు ,,,,
చేయి తిరిగిన చిత్రకారుని
కుంచె నుండి జాలువారిన
సప్త వర్ణాల పరిమళాలను
వెదజల్లే రవివర్మ చిత్రాల వలె ....
మరులు గొలిపే మరువ ధవనాలకైనా
శోభలనిచ్చే మల్లె చేమంతులకైనా
వనితామణులకు అవెంతో సింగారం
కేశాలంకరణలు ఏవైనా శృంగారం .....
ప్రియురాండ్ర తొలి ప్రేమలకైనా
పతిదేవుళ్ళ ప్రణయాల తోవలనైనా
అంద చందాలను ఇనుమడించు
అతివల సుందరమును ఎంతో పెంచు ....
అలుకల పూబోణిలకు ప్రియం
సుతారానా పతి మనసులను గెలువ
జగనపు సిరి మగువల జాడలకు
జన్మంతా అందములే సుందరమై .....
విశ్వములెల్ల విదితములయిన
వివిధ కేశాలంకారణల వినమ్రం
బంగారు దాంపత్యాలకు ముదము .....
భారతీయతలకు భలే ముద్రితం ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment