నాగుల చవితి
తేది: 08-11-2021
శీర్షిక : మానవ సంక్షేమ కారిణి
కవిత సంఖ్య :792
ప్రకృతిలో మనమొక పరమాణువులం
ప్రాణాలు నిలుప అత్యవసరాలైనా
గాలి నీరు ... పోషకాలకై అవసరాలు
తీరాలన్నా ... పరిసరాల పర్యావరణమే
నిత్య ప్రాణాధారం ....
ప్రకృతితో మమేకమైన మానవుడు
మృత్తికా ... నీరు ... అగ్ని ... పట్టినా
ముట్టినా పబ్బతే మన హైందవాన....
ప్రతీదీ దైవస్వరూపమే భారతాన ....
మానవ శరీరం కూడా నవరంధ్రాల
పుట్టే ... నాడులతో నిండిన మన శరీరాన్ని
నాట్యం చేయించేది మన వెన్నుపాము ....
మూలాధారమై ముఖ్య భూమిక మనిషికి ....
మనిషి శరీరంలో వెన్నెముక ప్రశాంతమనిపించినా...
కామ, క్రోధ, లోభ, మోహ, మద , మాత్సర్యాలకు
కేంద్ర బిందువై .... సత్వగుణ హారిణి ...అందుకే
తనువు మనువు సమర్పించుకుని... నిమగ్నమై
పూజించడం.... ఆచారమైనది ....
వ్యవసాయాధారితములో కూడా అనేక
రకముల చీడ పీడలకు కారణమయే క్రిమి
కీటకాలను హరిస్తూ ... సర్వదా మానవ
సంక్షేమ కారిణి నాగుపాము .... పూజనీయం ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment