తెలిస్తే ఏం చెయ్యగలం ?!
తేది : 18-10-2021
శీర్షిక : ప్రేక్షక పాత్ర....
కవిత సంఖ్య : 179
పేదోడి కోపం పెదవికి చేటులా....
తెలిస్తే ఏమౌతుందిలే... నిర్లజ్జ.....
ఏం చేయగలరు వాళ్ళు....నిర్లక్ష్యం ....
ధీమాల భీమాలతోనే...నాయక పయనం .....
అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను ....
ప్రతిపక్షంలో ఉంటే అధికారాలను
అమ్మ చాటు బిడ్డలా కొమ్ము కాచుకుంటూ
అప్పగించుకుంటున్న చందంగా ....
ఒకరికొకరు అలాయి ... బలాయిలే....
నిప్పుల కొలిమిలోని బొగ్గుల కణికలా
సామాన్యుడు క్షీణిస్తూ రక్తాన్నిస్వేదం చేసుకుని ...
నాలుగు రూకలు వెనకేసుకుందామంటే .....
బడా బాబులనుకున్నోళ్లంతా
జనాల నోటి కాడ బుక్క లాక్కున్నోళ్లే ....
ఒకప్పుడు ధర్మం నాలుగు పాదాల్లా ....
ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాలపై ....
అయినా కుమ్మక్కుల పర్వమే .....
ప్రజల గొంతంటూనే ... పత్రికలు
కూడా పబ్బపు గొడుగులే పడ్తున్నాయి. ..
అర్ధబలాలను ఆక్రమించడంలో ....
అంగబలం .... అధికారబలాలు .....
ఒకటికొకటి తోడవుతూంటే .....
కొన్ని న్యాయ దేవతల దీవెనలు కూడా
తోడు నిలువడం చూస్తుంటే ....
జ్ఞాన విజ్ఞాన జన సామాన్య
చక్షువులు మాత్రం… పాపం ...
ప్రేక్షకపాత్రలై చూస్తున్నాయి .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment