చిత్ర కవిత
తేది 01-10-2021
శీర్షిక : నిత్య రెక్కల కష్టం
కవిత సంఖ్య : 54+1
అచ్చమైన పచ్చగడ్డే పానుపాయే
ఆరుగాలం కష్టపడే బాల రైతన్నకు
అన్యం పుణ్యం ఎరుగని బాల్యానికి
నిత్య రెక్కల కష్టమే జీవన భృతి కాగా ...
బంగారు బాల్య గుంభనానికి బలముగా
నాన రెక్కల కష్టము తోడై నిలవంగా
నడి సంద్రంలో నావ కదులుతుండే
నిత్య జీవన నౌకకు నిజ తోడై నిలువ .....
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కూడా
వంతపాడుతుండె ....
రంగు రంగుల రాజధాని నుండి
రంకెలు వేసి బయలు దేరిన బడ్జెట్
అంకెలు.. బడుగుల బతుకులు చేరడానికి...
దాగుడుమూతలాడుతున్నాయని .....
ధవళ వస్త్రాల ధారణలు కాకుండా
దండి దొరలై నిండు మనసు చేసుకుని...
అండ దండలందిస్తేనే...
దర్పణాలు వెలగబెట్టే అధికారగణం
కూడా ఆత్మీయతలు ప్రదర్శిస్తేనే ....
పట్టింపులు కాకుండా పరిమితుల
పారదర్శకతల పాలనలు అందితేనే ....
దేశం నలుమూలలా సఖశాంతుల సుభిక్షాలు
సుందరవనాలై విలసిల్లుతాయి ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment