మట్టి ముత్యాలు
తేది : 13-09-2021
శీర్షిక : నవరత్నాలు
కవిత సంఖ్య : 751
మట్టి ... ముత్యాలేం ఖర్మ ....
మనసు పెట్టి మాట్లాడగలిగితే
మమతలతో జోడించగలిగితే
పండించవచ్చు పలు నవరత్నాలు ....
హాలికునికి మాత్రమే తెలిసిన
అవలీలత ... మట్టితో మమేకం
అయిపోగలగడం ... మనసుపెట్టి
మాట్లాడగలగడం ....ఆత్మీయతలు
రంగరించి అవపోశణ పట్టగలగడం ....
ఇంద్రధనస్సున ఇగురించే రంగులోలె
ధరణిలోన ఇమిడిపోయిన అస్తిత్వాలెన్నో
ఎర్రది, నల్లదని , ఇసుకది, రాళ్ళదని ,
రేగడి, సౌడులని రకరకాల రక్తి కట్టించు ....
రంగు రుచి వాసనలు పసికట్టే రైతన్న
అనుకూలతలన్నీ అవపోషణలు పట్టి
ఉప్పు కారం తీపి చేదు పులుపు వగరు
పంటలను.... ఎన్నుకుంటుంటాడు .....
మల్లె సుగంధాలనయినా
మరువ దమనము లనయినా
మనసుపెట్టి పండించగలడు
మాయచేసి రక్తి కట్టించగలడు .....
కూర బీరలనయినా
వరి ధాన్యాలనయినా
వరసపెట్టి పండించగలడు
రకరకాల రత్నాలన్నీ జోడించి
ఆకలినే మరిపించగలడు .......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment