Friday, November 5, 2021

చినుకుల ఒడి తేది : 22-09-2021 శీర్షిక : అమ్మ గుడి / నీలి సంద్రం

 చినుకుల ఒడి

తేది : 22-09-2021
శీర్షిక : అమ్మ గుడి / నీలి సంద్రం 
కవిత సంఖ్య : 168

గ్రీష్మ భానుడి భగభగలకు 
గీసులాడి ఆవిరైన సంద్రపు నీరు 
గిరి తరువుల చల్లని  గాలులకు 
అల్లన వర్షపు మేఘములై 
జల్లులు కురిపించు ధరణమ్మ ఒడిలో .....   

ఒడి చేరిన జడి వానల నీరు 
పంట చేలకు చేరి అన్న పానీయాలను 
అందించి... తాగు నీరు సాగు నీరై 
జీవరాశికి అన్నపూర్ణగా అమిరి పోయి  ... 
అమ్మ గుడిలా తలపించు .... చినుకుల ఒడి 

చిన్ని చిన్ని పాయలుగా పారి... 
సెలయేళ్ళుగా మారి ... వాగు వంకలై 
జోరుగా....నదులుగా పొంగి పొర్లి ... 
సంద్రములు  చేరు తిరిగి చక్రవ్యూహమై   .... 

కాల రీతుల కలి ప్రభావమో ....ఏమో .. 
సంద్రపు నీరు మేఘమై గర్జించ... 
మరకతమై శోభించు ధరణి మాత 
పచ్చ తివాచీలు పరుచుకున్న పూదోటలా.... 

అమ్మలా మారి ఆర్తి దీర్చు 
మానవాళికి ... జీవరాశికి .... 
ఆకలి దప్పుల దోబూచులాటలను 
అంతం చేసే మంత్రం వేస్తూ ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment