Friday, November 5, 2021

లాల్ బహదూర్ శాస్త్రి తేది : 02-10-2021 శీర్షిక : అసలైన దేశ భక్తుడు

  లాల్ బహదూర్ శాస్త్రి

తేది : 02-10-2021
శీర్షిక :  అసలైన దేశ భక్తుడు… 
కవిత సంఖ్య : 54+2

చిరునవ్వుల చిన్మయుడు 
దీక్షా పట్టుదలల ధీశాలి 
జయంతి ప్రాధాన్యం పొందిన 
జనప్రియుడు ..... 

తక్కువ సమయంలోనే 
ఎక్కువ పేరు ప్రతిష్టలు 
పొందిన గుణ సంపన్నులు 
వారణాసి వాస్తవ్యులు ..... 

కీడు తలిచే తెల్లవారికి 
కీలెరిగి వాతలు  పెట్టే 
క్విట్ ఇండియా ఉద్యమంలో 
కీలక పాత్ర పోషించె....  

కేంద్ర మంత్రిగారైన మంచి 
ముహూర్తాన ... మహిళలను  
వైవిధ్యమైన సేవలలో 
ప్రతినిధులను గావించారు ..... 

అకస్మాత్తు  ఆహార సంక్షోభం  
అధిగమించే ఆలోచనల్లో ... 
స్వల్పకాలిక . దీర్ఘకాలిక 
పరిష్కారాలెన్నో ప్రదర్శించె ..

కపట పొరుగుల కాశ్మీరు 
ఆక్రమణలకు... కలేజా 
చూపించి తరిమి కొట్టిన 
దేశ భక్త ప్రధానయ్యాడు .....  

జై జవాను జై కిసానంటూ 
అభినందనల నినాదానికి 
ప్రాణప్రతిష్ట చేసి ... హరిత 
విప్లవానికి క్షీర విప్లవానికి 
అంకురాలు వేసారు ...  

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment