భగత్ సింగ్
తేది :28-09-22
శీర్షిక : విప్లవం వర్ధిల్లాలి
కవిత సంఖ్య :
పుట్టుకతోనే స్వాతంత్య్ర భావాలు
పుణికిపుచ్చుకున్న పుణ్య చరితుడు
తాతలు తండ్రుల నుండే సంక్రమించిన
దేశభక్తి ... ఉద్యమాల కుటుంబం ...
బాల్యపు మాటలలోనే బహదూర్ తనం
చూపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ...
మితవాదంతో స్వాతంత్య్ర సముపార్జన కష్టమని
అతివాదం వైపు ఆకర్షింపబడ్డాడు ...
ఉద్యమాలకు పురుడు పొసే విధంగా
ఉర్దూ పంజాబీ పత్రికలలో వ్యాసాలతో
అహరహరం అవగాహనలు కల్పిస్తూ
అరాజకవాదాన్ని అక్కున చేర్చుకున్న
అరివీర భయంకర దేశభక్తుడు ....
మౌనంగా మునులై సాగిస్తున్న పోరాటంలో
లాలాలజపతిరాయ్ పైన జరిగిన
బ్రిటిష్ పోలీసుల దాష్టీకం కళ్లారా
చూసి కదిలిపోయిన మానవతావాది .
సాండర్స్ హత్య ... శాసన సభపై బాంబు
దాడి ... ఎన్నో అతివాద కార్యాలకు
మూలమైనది భావించి ఆంగ్లేయ ప్రభుత్వం
ఉరిశిక్ష ఖరారు చేశారు ....
గొప్ప దార్శనికుడు ... మాతృ దేశంపై
అపారమైన ప్రేమాభిమానాలు కలిగి
ఉరికొయ్యను ముద్దాడిన ఉన్నతుడు
చరిత్రలో సువర్ణాక్షరాలను మిగిల్చాడు ...
నగునూరి రాజన్న
కరినగరము (రిచ్మండ్)
No comments:
Post a Comment