Thursday, December 1, 2022

రాఖీ పౌర్ణమి తేది : 12-08-2022 శీర్షిక : అనురాగాల చిరునామా

 రాఖీ పౌర్ణమి 

తేది : 12-08-2022
శీర్షిక :  అనురాగాల చిరునామా 
కవిత సంఖ్య : 959

అవిభాజ్య కుటుంబాలు  
ఆత్మీయతల పూదోటలు 
తోబుట్టువుల తోరపు బంధం 
అనురాగాల  చిరునామా ..... 

అమ్మ పాలు తాగిన ప్రేమ 
రక్తం పంచుకున్న సాక్ష్యం 
ఒకరికి ఒకరు తోడంటూ 
కోరుకునే మనస్ఫూర్తులు .... 

పురాణేతిహాసాలలో 
పుణ్య వచనాలై ఉటంకించిన 
ద్రౌపదీ కృష్ణుల అనుబంధం 
యుగాల నాటి మాట రక్షాబంధనం 
హైందవాన బహు సుందరం... 

ఆడపడుచు అమ్మింట ఆదిలక్ష్మియై  
మెట్టినింట గృహాలక్ష్మిగా అడుగిడినా 
పుట్టినింటికి ఎప్పుడూ పెట్టని కోటే ... 
శుభాలుకోరు కోటిజన్మల పుణ్యఫలం 

తోబుట్టువుల క్షేమాలు తోరమై   
దిద్దిన తిలకం క్షేమకారకమై  
కొండంత అండగ నిలువ 
ఒకరికొకరు తోడునీడలయ్యే పండగ ....  
ఈ శ్రావణ పౌర్ణమి రోజుననే ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment