మనిషికి భూమికి మధ్య
తేది : 09-08-22
శీర్షిక : బొడ్డు తాడు బంధం
కవిత సంఖ్య : 956
తల్లి కడుపులో ఉన్నప్పుడు
తగిలించుకున్న బొడ్డు తాడులా ...
పుట్టీ పుట్టక ముందునుండే
కలిగే అమ్మలాంటి అనుబంధం ....
ప్రాణకోటికి సహాయకారిగా
పంచభూతాలైతే...చెట్టుకు
గుట్టకు వాగుకు వంకకు
ఆధారభూతమై మనిషిని
కంటికి రెప్పలా కాపాడేది ....
పుట్టుక నుండి పుడమి చేరే
వరకు అడుగడుగున త్యాగాలతో
అమ్మలా కనిపెట్టుకుని లాలిస్తూ
కడుపులో పెట్టుకుంటుంది .....
పొక్కిలించినా నిక్కచ్చిగా
అనేక పంటలిచ్చి అన్నపూర్ణలా
కడుపులు నింపి... అక్కున
చేర్చుకుని చేరదీస్తుంది ....
షడ్రుచులను మేళవించి
జివ్హాచాపల్యాలను తీర్చు ….
సప్త వర్ణాల సందోహాలతో
కుసుమ మనోహరాలను
కుమ్మరించి సదా మనసుల
రంజింపచేయు....
ఇవ్వడమే తెలిసిన అమ్మలా
సమయానుకూలంగా అన్నీ
సమకూర్చి మనిషి మనుగడను
ఎప్పటికప్పుడు తీర్చి దిద్దుతుంది ...
అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే
విశ్వాసం లేని వింతమనిషి...
విపరీత ధోరిణిలతో ఒంటినిండా
గనుల గాయాల పాలు చేసినా ...
గుంభనంగా సహనపు ఆనవాళ్లే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment