Thursday, December 1, 2022

భిన్న కోణాలు తేది : .01-08-2022 శీర్షిక : సమాజపు ఛాయలు

 భిన్న కోణాలు 

తేది : .01-08-2022
శీర్షిక : సమాజపు ఛాయలు
కవిత సంఖ్య : 950

సమాజమే నా దేవాలయమంటూ 
పదిమంది బాగుంటే ప్రసన్నం కొంతమందికి …
పుట్టుక చావు నాది... జీవితమంతా 
ప్రజలదేనన్న మహానుభావులెంతోమంది... 

పునాదులే లేని ఇంటికి 
పూల అలంకారాలను చేస్తున్నట్టు 
నాటకాల మాటలతో రంగం రక్తికట్టించి… 
అధికులను అమాయకత్వంలో ముంచి
ఆకర్శించి…. మూన్నాళ్ళ ముచ్చట్లతో 
ప్రజలను మోహనపరుస్తూ ముల్లె మూటా 
సర్దుకోవడం… కొంత మంది పయనం… 

కోరిన జనులకు కొండమీది కోతినైనా
కొదువచేయకుండా తెచ్చిస్తానంటూ
కోతలతో మునగ చెట్లెక్కించేసి… 
పగ్గాలను చేతబూనినా…స్వార్థాలతో 
సకిలిస్తూ మారాజులుగా వెలుగులీను...
మరికొంతమంది…. 

హరివిల్లు రంగులన్ని ఆరబోసుకుని
ఆశపల్లకిలో ఊరేగే మిధ్య బతుకుల 
మధ్యతరగతులు మాత్రం....అహరహరం 
శ్రమిస్తూ… నీతి నిజాయితీలకు నిలువెత్తు
రూపంగా తమను తామే ఊహించుకుంటూ 
పనికిరాని పన్నులులన్నీ కట్టేస్తూ….

మంచివాని సాంచాలో ప్రతిరూపమై నిలిచిపోవాలని… 
ఆరనీయని తపనల జ్వాలలతో రగిలిపోతూ… 
అందుకోరు పైవారిని …అలాగని ఆగిపోడు… 
చివరి వారితో కలిసినడవడానికి మనసొప్పక… 

పేరుకు అందరూ మనుషులే … అయినా
మనసులు పూజించ గలిగే మందిరమో…. 
గిరాటేయాల్సిన మలినములో ఏరి చూస్తే 
భిన్న కోణాలు..విభిన్న మనస్తత్వాలు.... 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment