సినారె
తేది : 29-07-2022
శీర్షిక : ఘన సినారె
కవిత సంఖ్య: 144+13
పల్లెసీమలో ప్రజ్వలించిన
మల్లెమాలల సుగంధం ...
ఉర్దూలో దుక్కి దున్నినా
మక్కువంత తెలుగుపైననే…
హరికథలు బుర్రకథలు
మనసునిండా అల్లుకోగా
పండించెను తెలుగులోన
పరిమళాలు విరబూయగ…
ప్రశాంతమైన వదనం
పరితపించె మానసం
లెక్కలేనన్ని కావ్యాలతో
సాహితీ బొక్కసం నింపె....
నిలువెత్తు తెలుగుతనం
నిండైన మనస్తత్వం ….
పలు భాషల పండించినా
అచ్చ తెలుగు కవితే చిరునామా....
భానుడి తేజముతో బాసిల్లినా
శశివెన్నెలలే కురిపించెను
వెండితెరల జాడలలో
దండి దొరగా నిలిచెను ......
పద్య గద్య రచనలతో
పాఠకులను అలరించి
ఉర్రూతల భావాలతో
ఉరికించిన పాటలు గజళ్ళు ....
వీధిబడిలో చదివిన బాల్యం
విశ్వమంతా ఎగిసిపడెను
విశ్వంభర కావ్యంతో
జ్ఞానపీఠం అధిష్టించెను ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment