చిత్ర కవిత
తేది :19-08-2022
చిన్ని కృష్ణుడు గజల్.
కవిత సంఖ్య : 158+6
కన్నయ్యా పరవశముగ
యశోదమ్మ తనయుడిగా
మురిపించెను పరవశముగ
కళ్లుతెరిచె జైలులోన
కథను రక్తి కట్టించగ
మధురలోన జన్మించీ
మరిపించెను పరవశముగ
పాలు పెరుగు వెన్నలనూ
పంచినాడు సోపతులకు
మధురమైన స్నేహమునూ
కురిపించెను పరవశముగ
కాళీయా మర్ధనమూ
కమనీయపు తాండవమూ
గోవర్ధన గిరినెత్తీ
రక్షించెను
పరవశముగ
తారంగం తన్మయించి
తనువులన్ని పులకించా
వేణువునూ గోకులాన
రవళించెను పరవశముగ
అష్టభార్యలిష్టసఖుడు
ఆనందపు నందనుడూ
గోపెమ్మలు తపనలతో
స్తుతియించెను పరవశముగ
విశ్వమంత తానేనని
విడమరిచిన జగద్గురుడు
కారణజన్మ తనదేనని
కరుణించెను పరవశముగ
జనా మరణ జాతకాలు
జగమెరుగగ మనధర్మమె
గీతబోధ చేసి తాను
వినిపించెను పరవశముగ
ఆయుధమే ముట్టకుండ
అణిచినాడు అధర్మమూ
ధర్మసంస్థాపనార్థం
బోధించెను పరవశముగ
నగునూరి రాజన్న
No comments:
Post a Comment