మత సామరస్యం
తేది : 15-08-2022
శీర్షిక : పరమవిశిష్టమైన ధర్మమార్గం
కవిత సంఖ్య : 3
చేతివృత్తుల చెంగల్వపూలు
బండ గురుతుల బాధ్యతలేమో
సమం లేని సందర్భమైనా
ఐదువేళ్ళు కలిస్తేనే ఆకలి తీరేది ....
మతాల సారమంతా మానవత్వమని
మర్మాలను సవివరంగా బోధిస్తూనే ....
స్వార్థాలను సంకనేసుకుని నాయకులు
మారణహోమాలకు ముహూర్తాలు ....
కులమైనా మతమైనా కుత్చితాలకు
పోకుండా ... గడపలోపల పాటించి
సంయమనాలతో సర్దుకుపోతుంటే
స్వర్గసీమల అంచున నిలవడమే .....
సామాన్యులకు లేని పట్టింపులకు
సంకీర్ణతలు జోడిస్తున్నరాజకీయా లు
రంగులు పులిమే సంకటాలు
స్వార్థపరులు చేస్తున్న సన్నాహాలు...
నీవు నాకెంత దగ్గరో ....
నేను నీకంతే దగ్గరంటూ
మన మతాన్ని పాటించుకుంటూ
పరమతాన్ని గౌరవించుటే
పరమవిశిష్టమైన ధర్మమార్గం .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment