Thursday, December 1, 2022

ఆజాదీకా అమృత మహోత్సవం అంశం : డెబ్భై ఐదు వసంతాల స్వతంత్ర భారతం .. శీర్షిక : స్వాతంత్య్ర ఫలాలు

 ఆజాదీకా అమృత మహోత్సవం 

అంశం : డెబ్భై ఐదు వసంతాల స్వతంత్ర భారతం .. 
తేది : 09-08-2022
శీర్షిక :  స్వాతంత్య్ర ఫలాలు 

ఇంటింటా ఆనందం వెల్లి  విరిసిన భారతం 
ఇగురించిన శోభల ఇనుమడించిన  త్రివర్ణం .... 
కులాసాల రెపరెపలు కులమతాలకతీతమై 
వినువీధుల సగర్వమై వీరుల త్యాగఫలంగా ..... 
           
చిరునవ్వుల ప్రాయంగా ముద్దాడిరి మృత్యువును 
ఉరికంబాలలుముకుని చిరంజీవులాయిరి ..... 
చరితలోని కెక్కని చిరుతపులులు ఎన్నెన్నో 
చిత్తరువులు సైతం అందుబాటు లేవేమో ... 

లెక్కలేని ఉద్యమాల పిక్కటిల్లిన భారతం 
స్వదేశీ శంఖమూదె విదేశీ బహిష్కారంకై 
సిపాయిల తిరుగుబాటు గుండెలదిరె శత్రువుకు 
నిప్పోలే రాజుకునే ఉప్పు సత్యాగ్రహం...  
              
అతివాదం మితవాదం అల్లుకున్న పోరాటం             
ముప్పేటల దాడిగా ముసురుకునే తెల్లోడిని ..
ఆసేతు హిమాచలం అలుపెరుగక పోరాడిరి 
స్వరాజ్యమే నా హక్కని సాధించిరి నినదించి ..... 

స్వార్థపరుల చేతులలో అప్పుడప్పుడు 
అలమటించినా .... అలుపెరుగని 
పోరాటాల వెతల వెల్లువలే ఆద్యంతం .... 
రెండు శతాబ్దాల విలువల నిరీక్షణలు ....  
                 
వజ్రోత్సవ వేళలో వల్లె వేయ ప్రతినబూని 
సంస్తుతించు సగర్వమై స్మరణలతో సమరయోధుల .... 
ఆదరించి వీరులను అందరికి నివాళిచ్చి 
అడుగడుగున మననమే ఆజాది అమృతము ....  

స్వాతంత్య్ర సమర ఫలాలు  సద్వినియోగమై 
పల్లెల మూల మూలల గుడ్డి గుడిసెలు చేరి
గుండెల నిండా వెలుగులు నింపినపుడే .... 
అసలు సిసలైన అమృత మహోత్సవం ...... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment