Thursday, December 1, 2022

పేరడీ గేయాలు తేది : 06-08-2022 శీర్షిక : ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి…

 పేరడీ గేయాలు 

తేది : 06-08-2022
శీర్షిక : ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి… 
కవిత సంఖ్య: 955

జగతిలోన వెలసిన మాయలరీతి 
ఓటరులే ఈ బ్రతుకును 
ఎంచుకున్న దారి             
ఓటరులే ఈ బ్రతుకును 
ఎంచుకున్న దారి  ..... 

యోగ్యతలే లేకుండా ఎన్నుకుంటే
మిగిలేది నరకమే
జీవితమే ఇక అగును 
నరకప్రాయము  ... 
మంచి చెడులలో మాట వినని 
పాలకుడే కావాలా .... 
నాయకుడే ప్రతివారికి 
అండదండ లేక  ....       // జగతిలోన // 

సేవలతో  పిన్న పెద్దలనేడిపించగా ... 
ఒక్కరికీ అక్కర కాని  మూర్ఖునిగా 
సేవలతో  పిన్న పెద్దలనేడిపించగా ... 
ఒక్కరికీ అక్కర కాని  మూర్ఖునిగా 
ఒక్కరికీ అక్కర కాని మూర్ఖునిగా ... // జగతిలోన // 

యువతను నిర్వీర్యంగా 
చేయు విధానాలతో … 
దేశాన్నే నరకప్రాయం మార్చే 
రాక్షుసులుగా ….. 

యువతను నిర్వీర్యంగా 
చేయు విధానాలతో … 
దేశాన్నే నరకప్రాయం మార్చే 
రాక్షుసులుగా 

సృషించెను ఆ బ్రహ్మ 
అసురులుగా అవనిపై ..... 

జగతిలోన వెలసిన మాయలరీతి 
ఓటరులే ఈ బ్రతుకును 
ఎంచుకున్న దారి             
ఓటరులే ఈ బ్రతుకును 
ఎంచుకున్న దారి  ..... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment