నవ్యాలోకనం
తేది : 30-08-2022
శీర్షిక : మేలు కలయిక
కవిత సంఖ్య :973
ఆశల గంపలు నిండుతాయో లేదో
ఎవరమూ చెప్పలేము కానీ ...
అత్యాశల గంప మాత్రం ఎన్నటికీ
నిండదని డంకా బజాయించవచ్చు ....
రూపంలేని మనసే ఆలోచనల
చిక్కుముడి కేంద్రం....ఆశలకు
అత్యాశలకు ఆరాటపడి అంకురమై
ఆశయాలకు నాంది పలుకుతుంది ...
అదే ఆశయం అనుభవ సారాల
అవపోషణలతో... సంక్షేమాల సద్ది
ముళ్ళైనిలిస్తే...ధర్మ పాదాల అడుగులను
అనుసరిస్తూ ... న్యాయ సూత్రాలను
నమ్ముకుంటే ... అభివృద్ధికి చిరునామే ...
పాతెప్పుడూ రోతే ... కొత్త మాత్రమే వింత
అనే ధోరిణిగా కాకుండా ... మిశ్రమ
రీతుల ఆశ ... ఆశయాల ...గమనమే
నవ్యాలోకనంకు శ్రీకారాలను చుట్ టి ...
అభివృద్ధికి బాటలు వేస్తుంది ..
అలా సాగితే అదే ముదావహం ...
నూతన విజ్ఞాన తరువు కొమ్మలకు
విచక్షణ కుసుమ పరిమళాలను
అద్దుకుంటూ... అనుభవాల అడుగులలో
సాగితేనే మానవాళి శోభాయమానమౌతుంది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment