Thursday, December 1, 2022

చిత్ర కవిత తేది : 23-07-22 శీర్షిక : పల్లె సుగంధం

 చిత్ర కవిత 

తేది : 23-07-22
శీర్షిక : పల్లె సుగంధం 
కవిత సంఖ్య : 144+11

పచ్చ  తివాచీలు పరుచుకున్న 
పడమటి సంధ్యారాగంలో 
పంట కాల్వలు  ఒంటిని చల్లబరచ 
ప్రకృతి ఒడిలో ఒదిగిన పసికూనలు ....  

పచ్చందాలలో పుచ్చ పూవు 
పూసినట్టుంది బాల్యమంతా .... 
కొత్తనీటి కోనేటిలో విచ్చుకున్న 
కమలాలై ఆటా పాటలతో .... 

వేసవి తాపాలకు గీసరిల్లి 
గోసపడ్డ పల్లీయులంతా 
సుడులు తిరిగే పిల్ల కాలువలో 
చల్లదనాల లేపనాలకు మురిసిరి .... 

పట్నం పిల్లలకు ఆమడల 
దూరమైన ఎన్నో ఆటపాటలు 
ఆనందాలు సంతోషాలు 
పల్లె ప్రజలకింకా పరిచితమే
సుగంధాల భరితమై ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment