Thursday, December 1, 2022

ఒక వేలు చూపిస్తే తేది :28-07-2022 శీర్షిక : మనతోనే .....

 ఒక వేలు చూపిస్తే

తేది :28-07-2022
శీర్షిక : మనతోనే ..... 
కవిత సంఖ్య : 947

ప్రకృతి పరంగా వచ్చినదో 
పారమార్థికంగా వచ్చినదో 
సందర్భం అవునో .. కాదో ... 
అవసరం ఉందో ... లేదో ... 

విషయం తెలిసిందైనా తెలియందైనా    
సందు దొరికితే సలహాల పర్వం .... 
మనసుకు నచ్చిన మతలబులతో 
మన మాటే మంత్రం కావాలని .... 

అవిభాజ్యాల మనం పోయి 
అహాలు నిండిన నేనయ్యాక 
అంతా నేననే చిత్తం నెత్తిపై 
తాండవం చేస్తుంటే .... 

వినడం నేర్వని వింత జాతి 
కన్నది కపటమనే జాడ్యం ... 
సాటి మనిషిని సన్నుతించని 
నేనే మిన్న అనే వితండం .... 

ప్రజ్ఞల పర్వం దండిదైతే 
విరివిగా విచక్షణల అడుగులు 
ముందుకు పడాలి... 
ప్రగతి రథం పట్టాలెక్కాలి 
సంపూర్ణతలు అన్నింటా పండాలి ... 

నువ్వంటే నువ్వని వేలు చూపిస్తే 
నావైపే నాలుగు వేళ్ళు ..... 
కాదని మనమే అడుగు ముందుకేస్తే 
కాదా వినయశీలతల సామ్రాజ్యం ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment