లలిత గీతాలు
తేది : 20-08-2022
శీర్షిక : లలిత గీతాలు
శీర్షిక : సుందర హిమాలయం
పల్లవి
అందమైన భారతికి
సుందరమే హిమాలయం ...
కందామా మనమంతా
కనులారా వీక్షించి
చ 1.
తలపైన కిరీటమై
తనువంతా విస్తరించె
కాశ్మీరం మొదలుకుని
అరుణాచల్ వరకును ....
ఎవరెస్టు కారాకోరం
ఎత్తైన పర్వతాలు
విశ్వంలోనే వింతగా
కనువిందు తోరణాలు ...
చ 2
ఆసియాన దేశాలకు
అస్తిత్వం చేకూర్చి
ఆధ్యాత్మిక కేంద్రాలకు
ఆలవాలమైనది ...
మహితమైన మంచులింగం
శక్తిపీఠం వైష్ణోదేవి
భక్తినిచ్చు చార్ ధామ్
ముక్తినిచ్చు ముక్తినాథ్
//అందమైన//
చ 3
వెన్నలాంటి మనసున్న
ముక్కంటికి నిలయమై
వెండికొండ తలపించు
వేదములు ఘోషించు ....
భాగీరథీ బ్రహ్మపుత్ర
జన్మలకు మూలము
బంగారు వర్ణమున
కైలాస దర్శనం ....
//అందమైన//
చ 4.
గంగమ్మ సింధువులు
ఘనమైన బ్రహ్మపుత్ర
నదులకు నిలయమై
నాగరికత లిచ్చింది...
హద్దులుగా నిలిచితాను
సుద్దులెన్నో చెబుతుండే
స్వార్థాలకు సంకెళ్ళుగ
బుద్ధిమాట కేంద్రమై ....
//అందమైన//
No comments:
Post a Comment