మార్పు ఏది
తేది : -17-08-2022
శీర్షిక : అతి సర్వత్ర వర్జయేత్…
కవిత సంఖ్య : -158+7
సమూహాలుగా సాగించిన బ్రతుకు
క్రూరమృగాలను జయించిన సత్తా
కనికట్టుగా కపటనాటక సూత్రాలకు పుట్టిల్లై
కొట్టుకుంటున్నది నేడు మానవ బుద్ది ….
నాగరికతలో నాలుగు అడుగులు వేసినా
ఆత్మీయతల అమ్ముల పొదియే ... నాడు
అత్యాశల పల్లకిలో ఊరేగుతూ... అందని
ద్రాక్షలు పుల్లనలా ..ఆవురావురంటున్నాయి...నేడు..
మానవత్వపు నీడలలో మనువులను
సుసంపన్నం చేసుకున్న మానవాళి .....
స్వార్ధపొరలు కమ్మిన కబంధ హస్తాల
ధృత రాష్ట్ర బాహుబలిలో నలిగి పోతున్నది
విజ్ఞాన వివేకాల వివేచనల గనినని ప్రశంసలతో
ముంచుకుని.. జీవరాశిలోనే మిన్నని విర్రవీగిన
మనిషి…. సాటి మనిషినే సాగనంపాలని చూస్తూ
వింత వింత పుంతలు తొక్కుతున్నాడు….
పారిశ్రామికతలో పదడుగులు ముందుకేసి
పగడపు దీవులు చేరుకన్నామనుకునేసరికి
పతనమై దీనావస్థలు పడుతూ….
వికారాలవైపు మొగ్గు చూపుతున్నది....
సాంకేతికతలో సాధికారున్నని
మీసం మెలేసేసరికి...అసలుకే మోసమై…
ఇంటినుండే ఆర్థిక వనరులు
దోచుకుంటూ నిన్ను...
ఇరకాటంలో పెడుతున్న దాఖలాలు…
అంతేనా అంటే అద్వితీయమైన
కుటుంబప్రేమలు కూడా అడుగంటి…
అత్తెసరు మార్కుల గట్టెక్కుతున్న
విద్యార్థిలా…డీలా పడిపోతున్నయి…
నాడైనా… నేడయినా…ఏనాడైనా…
అతి సర్వత్ర వర్జయేత్…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment