Thursday, December 1, 2022

తల కిందులు తేది :10-08-22 శీర్షిక : ఊహల సుందర ప్రపంచం

 తల కిందులు 

తేది :10-08-22
శీర్షిక : ఊహల సుందర ప్రపంచం 
కవిత సంఖ్య : 957

నరక యాతనల బలిగొన్న చరితలు
దాటుకుని నందనవనంలో 
సుందర సుమధుర భావనలు 
ఉల్లము పొందిన సంతోషాలు...  
 
రాక్షస క్రీడల రోజుల యాదులన్నీ 
సమసి పోయాయనుకున్న క్షణాన 
పెనుభూతమై వింత ధోరిణిలతో 
విరుచుకు పడుతున్నదని తెలిసి ... 
వెంటబడి తరుముకొస్తున్నాయని 
తెలిసినప్పుడు.... 

కలలన్నీ కల్లలవుతూ.... 
బ్రతుకంతా తల్లకిందులే 
ముందు తరాల జీవనచిత్రం  
భవిష్యతంతా చిందర వందరే ... 
 
ఊరించిన ఊహల సుందర ప్రపంచం 
ఊసులు నిండిన సుమ సుందరం 
కనుల ముందే కబళించనుందా 
కనుమరుగై పోనుందాని .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment