బతుకమ్మ 2022
తేది : 25-09-2022
శీర్షిక: తెలంగాణ పండుగ
కవిత సంఖ్య :
రామ రామ రామ ఉయ్యాలో
శ్రీరామ రామనే ఉయ్యాలో
పెత్రమాస రోజున ఉయ్యాలో
బతుకమ్మ పండగ ఉయ్యాలో
ఇంతులందరూ జేరి ఉయ్యాలో
బంతులై పోదురూ ఉయ్యాలో
గుమ్మడాకులేసి ఉయ్యాలో
రంగుల పూలతో ఉయ్యాలో
బతుకమ్మ పేర్తురు ఉయ్యాలో
గౌరమ్మ పెడుదురు ఉయ్యాలో
కోటొక్క రాగంతో ఉయ్యాలో
గొంతులే కలుపుదురు ఉయ్యాలో
కాలపు కష్టాలు ఉయ్యాలో
కమ్మని సుఖాలు ఉయ్యాలో
కోయిలమ్మలంత ఉయ్యాలో
వడబోసి చెప్పుదురు ఉయ్యాలో
ఊరంత కలిసిరి ఉయ్యాలో
ఇచ్చుకొను వాయనాలు ఉయ్యాలో
తొమ్మిది రోజులు ఉయ్యాలో
అమ్మవారి సేవ ఉయ్యాలో
కమలాక్షులంతా గూడంగా ఉయ్యాలో
కన్నుల పండుగే ఉయ్యాలో
నగునూరి రాజన్న
No comments:
Post a Comment