Thursday, December 1, 2022

ఒక్క మాట కోసం తేది : 04-08-2022 శీర్షిక : తడుముకోని జవాబే చరితలో....

 ఒక్క మాట కోసం 

తేది : 04-08-2022
శీర్షిక : తడుముకోని జవాబే చరితలో.... 
కవిత సంఖ్య : 953

పూర్వ జన్మ పుణ్యఫలములే 
పురుషోత్తముడే వచ్చి వాలె 
పసిబాలుడై పారాడే ఇంటిలో 
ప్రముఖుడై నిలిచె చరితలో .... 

అమ్మ నాన్నలన్న ఆత్మీయతల
చిరునామాలు ..  
తోబుట్టువులన్న తొట్రుపడని 
అనురాగాలు... 
గురువులన్న ఎనలేని గౌరవాల 
రాశులు ... 
సర్వ సద్గుణ సంపన్నతల 
శ్రీమంతుడు ... 

పితరుని మాటకు పరితపించి 
పరపతి పెంచె జగతిలోన.... 
పటుతరముగ పదునాలుగేండ్లు  
కానలకేగి కష్టాలను కడు ఇష్టంగా 
మలుచుకునే... 

సవాలక్ష కారణాలతో సహచరి 
దూరమైనా ...కాలంతో కలిసి 
పయనించి .... కష్టాలను ఎదుర్కొని 
కపి రాజుల చేయూతల ..  కఠోర 
సాధనల కనిపెట్టి ...దిశలన్నీ 
సహకరించ...దశకంఠుని నేలకూల్చి ...
కబంధాల చెరనుండి  సతి సీతమ్మను 
కాపాడే ..... 

ఒక్కటంటే ఒక్క మాటకోసం....  
మహారాజ భోగాలను తృణప్రాయంగా 
వదిలిపెట్టి... ఒళ్ళంతా హూనమయ్యే 
అలవికాని కష్టాలతో అరణ్యవాసం 
అనుభవించే ..... 

యుగాలు దాటినా ఉన్నతమని 
కీర్తించే తండ్రి మాట జవదాటని 
తనయుడంటే శ్రీరాముడేనని 
తడుముకోకుండా జవాబే చరితలో .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment