శిల్ప దృష్టి
తేదీ : 29-08-2022
శీర్షిక : గుణ భూషణం
కవిత సంఖ్య : 972
కాల మహిమలో...కార్య సాధనలో...
కలిసి బతికే సంఘజీవులం మనం...
కఠిన శిలను శిల్పంగా మలిచినట్టు
కావు కావు కాకుల్లా నిత్యం కలబడకుండా
కుహూ కుహూ కోకిలలమై అందంగా ఆలపిద్దాం ...
గులక రాళ్లు ముళ్ళ పొదలను దాటుకుని
సాగే నీటి పాయల పయనం సెలయేళ్ళై
పరుచుకుని... పంటల పచ్చందాలకు
పరవశాల జల్లులు మూటగట్టుకున్నట్టు ...
చిన్న చితక పొరపాట్లకు గ్రహపాట్లకు
చిరుబురులాడక... దండి ధనాత్మకతను
దర్శిస్తూ ...అందరిలో కలిసి అడుగులేసి
మానవతవైపు మనమూ నడకలు సాగిద్దాం...
సమూహంలో అందరూ సత్పురుషులే
ఒంటరులైతేనే బయల్పడు వికృతాలు.. .
అన్నదాతకు గిట్టుబాటిద్దామంటూనే
జలాశయాల గట్లు తెగనార్చె రాజకీయాలు. ...
అధికారపక్షమైనా ... ప్రతిపక్షమైనా ..
ఏళ్లతరబడి ఏలినవారి పుణ్యాలు
స్వలాభాలే ... .
అతివల సాధికారతలు సాదిద్దామంటూనే
కాగితాలకే పరిమితం చేస్తున్న దర్పాలు...
సర్వేంద్రియానాం నయనం ప్రధానం
నోరు మంచిదయితే ఊరు మంచిలా ...
మనం సారించే దృష్టి కోణమే సమాజ
బింబనలు ...ప్రతిస్పందనల సమాహారం ....
సత్యహరిశ్చంద్రుని వారసులమైనా...
విజ్ఞాన విచక్షణలను జోడించుకుంటూ
సముచితాసముచితాలను సమదృష్టిగ
స్వీకరించగలగితేనే చిక్కులులే ని చక్కదనం ...
నువ్వంటే నువ్వని పోరకుండా
మనతోనే మొదలవ్వాలి మార్పుకు శ్రీకారం ....
మనమే అవ్వాలి నాంది మంచికి మారుగా ...
పదండి అడుగులు కలపండి .. కదపండి ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment