Friday, December 2, 2022

యుగళగీతం తేదీ : 27-08-2022 శీర్షిక : ప్రేమ

 యుగళగీతం 

తేదీ : 27-08-2022
శీర్షిక : ప్రేమ 
కవిత సంఖ్య : 971

అతడు :
మనసే మందిరముగా 
మమతలను నింపుకుందామా ...  

ఆమె : 
హృదిలో ప్రేమలు నింపి 
మది తలపులు తడదామా 

అతడు : 
తరువులమై ప్రకాశించి 
కుసుమ పరిమళాలు పంచి 
సెలయేటి గలగలల మెరిసేటి 
అందాలను మనము చేరుదామా .... 

ఆమె : 
చుక్కలనూ కోసుకొచ్చి 
కొప్పులోన తురిమెదవా 
నెలవంకను దొరకబుచ్చి 
మకుటంగా నిలిపెదవా .... 

అతడు : 
గిరులలోని మంచుపూలు 
లోయలలో అందాలను 
మనసారా మురిపించి 
గువ్వలమై ఒదిగిపోదామా .... 

ఆమె: 
అవనికి తరువులా ... 
తరువుకు కొమ్మలా 
కొమ్మన పూవులా పరిమళించి 
ఒకరికి ఒకరమై కరిగిపోదాము ..... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment