అమ్మ ఒడి
తేది : 08-08-2022
శీర్షిక : ఒద్దికైన బడి .
కవిత సంఖ్య :
అమ్మ ఒడి శ్వాసల జడి
విశ్వాసాల కావడి
అపూర్వమైన మమకారాల
ఒద్దికైన బడి ...
ప్రత్యామ్నాయమంటూ లేని
సుమసుందరమైన పాన్పు ....
బాల్యంలో తొట్ట తొలి ఊయలై ...
జోలపాటల పుట్టిల్లై ...
ముద్దు ముద్దు ముచ్చట్లకు
హద్దులెరుగని పట్టు పరుపే ....
నిర్భయాల
నిదురలకైనా
నిశ్చింతల
ఆటాపాటలకైనా
తొలి బోధనల సమయాన గురువుగా
మమతలు కురిపించే మందిరం ....
నులి వెచ్చని అమ్మ చేతి వేళ్ళ
స్పర్శలు అమృతాలను వంపి
ఆనందాలను నింపి ...అర మోడ్పుల
అర్ద నిమీలిత నిద్రల హాయి
చేకూర్చి మరో లోకంలో విహరింపచేయు
నగునూరి రాజన్న
No comments:
Post a Comment