కార్గిల్ దివస్
తేది : 25-07-2022
శీర్షిక : ప్రేరణ దినము
కవిత సంఖ్య : 144+11
వందలేండ్లయినా వదలని
ఆలోచనా విధానమే హైందవం .....
నాదన్నది వదలమని ....
నాది కానిదేది నాకు వద్దనేది .....
అందమైన కాశ్మీరంలో
సుందరమైన ప్రదేశాలెన్నో ...
ఆకర్షణలకే కాకుండా
రక్షణలకు మూలమయ్యే శిఖరాలెన్నో ...
చంచల చపల చిత్తులు
వంచనలకు మారు పేరు
పొంచిరి కపట నీతిన
పొరుగునున్న దాయాదులు ....
స్వీయ చిక్కులతో ఊపిరాడకున్నా ...
చికాకులతో ఊపిరి బిగపట్టుకునైనా...
పరాభవాల పాఠాలను పక్కన బెట్టి కూడా ...
పక్కలో బల్లెంలా పదే పదే కాలు
దువ్వుతుంటారు...
ఇరువది మూడు వత్సరాల క్రితం
ఇదే రోజు ... మారోమారు కార్గిల్ లో
కాలుదువ్వి కనువిప్పులు తెచ్చు కుని ...
కాళ్లకు పరుగందించి.... పలాయనం చిత్తగించి
తోక ముడిచి పారిపోయారు .....
వాడి నక్క జిత్తులకు... వాలిన
మన వందల సైనికుల తనువులు
రక్తం చిందించి 84 రోజుల్లో తిరిగి
హస్తగతం చేసుకున్న ఆపరేషన్
విజయ గీతిక ....
కాల గమనంలో మనం
కార్గిల్ విజయ దివస్ గా
జరుపుకుంటూ ...వారికి జోహార్లతో
పెద్దన్నలా ప్రేరకమై నిలుస్తున్నది.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment