Thursday, December 1, 2022

ఆయువు పట్టు తేది : 25-07-2022 శీర్షిక : ఉనికికే మూలం

 ఆయువు పట్టు  

తేది : 25-07-2022
శీర్షిక : ఉనికికే మూలం 
కవిత సంఖ్య : 945 

తరువే తనువుకు ఆభరణం 
జీవరాశి ఉనికికే మూలం 
అవని ఆస్తిస్త్వానికి కారణం 
అయినా మారని ద్రోహం ..... 

ఉద్భోదల ఉక్కు సంకెళ్లు 
తెంచుకుని...స్వేచ్ఛల 
చొక్కాలు తొడుక్కుని  ఎవరికీ 
వారే యమునా తీరేలా ప్రవర్తనలు ... 

నడతల నియమావళీల నీడలను 
మిడతల దండులా బేఖాతరు చేస్తూ .... 
నరకయాతనల ద్వారాలు తెరుస్తూ 
మరకతశోభల మాయలకు దోహదాలు  ....   

స్వీయ క్రమశిక్షణల చింతలు మాని 
సంఘ సేవల సంద్రంలో సభ్యులై 
అధికారాలను దఖలుపరుచుకుని 
అందినకాడికి దండుకునే దండు పాలెం .... 

ప్రాణవాయువులను పరిహాసం చేసే 
ప్రజలకైనా ... ప్రజా నాయకులకైనా ... 
ప్రకృతి పరోక్ష సంకేతాలెన్నో పదే పదే
మారితే మానవులం ...లేదంటే కళేబరలాం ... 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment