కాళోజి జయంతి
తేది : 09-09-2022
శీర్షిక : మానవతా వాది
కవిత సంఖ్య : 982
అక్షరాల మాంత్రీకుడతడు
లక్ష్యము గల సాహితీ సేవకుడు
తెలంగాణా గుండె చప్పుళ్ళకు
తెగువ చూపించిన కవి పండితుడు.....
ఉద్యమాలే ఊపిరిగా బతికిన
ఉన్నతమైన మానవతా వాది ...
దమననీతులను అరాచకాలను
అడుగడుగున ఎదిరించిన ధీశాలి ....
నిత్య చైతన్య శీలి.. ప్రజా పక్షపాతి
గ్రంథాలయోద్యమంలో క్రియాశీలి
ప్రజలను చైతన్యవంతం చేయడానికి
నిర్విరామంగా కృషి సలిపిన గుణశీలి .....
హింసను వద్దంటూనే ...
అహింస మార్గంలో సామాజిక
సమస్యలపై నిర్మొహమాటంగా
నిక్కచ్చిగా నిష్కర్షగా అక్షరాయుధాలు
సంధించిన ప్రజాకవి ....
బహుభాషా పండితుడు
కవితలతో గొడవ పడ్డ మేధావి ...
భాషను యాసలను బతికించ
యాతన పడ్డ తెలంగాణ సాహితీ రైతు....
నిజాముల నిరంకుశాన్ని
నిక్కచ్చిగా నిగ్గదీసిన ధీశాలి
వలస పాలకుల పక్షపాతాలను
వడకట్టిన అక్షరాయుధుడు ....
ఆణిముత్యాలైన అతని మాండలికాలు
అపూర్వమైన సాహితీ రచనలు
పాఠ్యముషాలైనవి పట్టభద్రులకు
పరిశీలనలకు పీజీలకు డాక్టరేట్ లకు
దారి చూపించాయి ...
పలికిన మాటలకు పొంతనగా
పనులు చేసిన ఘనాపాటి ....
పార్థీవమును కూడా ప్రయోగాలకై
వైద్య కళాశాలకిచ్చిన మహోన్నతుడు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment